క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది సినిమాల్లో నటించిన ప్రగతి గురించి గత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రగతి త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందని, వరుడు కూడా దొరికేసాడని పలు మీడియా వెబ్ సైట్‌లు రాసుకొచ్చాయి. కాగా తాజాగా ఈ వార్తలపై ప్రగతి స్పందించింది. పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అసలు ఇలా ఫేక్ వార్తలను ఎందుకు పుట్టిస్తున్నారని ఫైర్ అయింది. అంతేకాకుండా తనపై వస్తున్న దృష్ప్రచారలపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇతరుల వ్యక్తిగత జీవితాలపై వార్తలు రాసే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రగతి కోరింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వార్తలు ఎలా రాస్తారని మండిపడింది. గౌరవమైన పొజిషన్‌లో ఉన్నప్పుడు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరింది. అంతేకాకుండా వార్తలు ప్రచురించిన సంస్థపై ఫైర్…