దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ప్రభాస్ చిత్రం ‘సలార్’ సినిమా ఈనెలలో విడుదల కావాల్సి వుంది, కానీ ఇప్పుడు నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కొత్త విడుదల తేదీ ఎపుడు అన్నది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి వుంది. అయితే ఈ సినిమాను ఎందుకు వాయిదా వేశారు అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. ఇంతకీ ఆ కారణం ఏంటో తెలుసా, ఈ సినిమాకి గ్రాఫిక్స్ వర్క్ అవకపోవటమే విడుదలకి జాప్యం అని తాజా సమాచారం ప్రకారం తెలిసింది. ఈ సినిమాలో గ్రాఫిక్ వర్క్ చాలా ఉందని, అది చేసి ఇవ్వటంలో జాప్యం జరిగిందని తెలుస్తోంది. మామూలుగా సినిమా గ్రాఫిక్ వర్క్ విడుదల తేదీకి ముందుగా అంటే ఒక నెల రోజులు ముందుగా ఆ పనులు పూర్తయిపోవాలి. ఎందుకంటే అందులో మళ్ళీ కరెక్షన్స్…