కంటెంట్ ని నమ్ముకొని తీసిన చిత్రం ‘పిండం‘ : హీరో శ్రీరామ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పిండం‘. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల మేకర్స్ ‘పిండం’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుండి టీజర్ విడుదలైంది. ఈరోజు(అక్టోబర్ 30) ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్ర బృందంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు…