చూడాల్సిన అసలుసిసలైన హారర్ సినిమా ‘పిండం’ : కథానాయకుడు శ్రీరామ్

'Pindam' is an original horror movie to watch: Sriram is the protagonist

ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు విలేఖర్లతో ముచ్చటించిన కథానాయకుడు శ్రీరామ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఒకరికొకరు సినిమా వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ అలాగే ఉన్నారు. మీ ఆరోగ్య రహస్యం ఏంటి? ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకుంటాను. ఎక్కువగా ఇంటి భోజనం తింటుంటాను. బయటకు వెళ్ళినా ఎక్కువగా పప్పు, సాంబారు వంటి ఆహారమే తీసుకుంటాను. అలాగే ఉన్న దాంతో సంతృప్తి చెంది, ఆనందంగా ఉంటాను. పిండం సినిమా గురించి చెప్పండి?…