‘మెకానిక్‌’ లాంటి సమాజానికి ఉపయోగపడే సినిమాలను ప్రజలు ఆదరించాలి: సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

People should support films like 'Mechanic' which are useful to the society: Cinematography Minister Komatireddy Venkatareddy

టీనాశ్రీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై మణిసాయితేజ-రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్‌’. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డ్కెలాగ్స్‌, పాటలు కూడా రాశారు. ఎం. నాగ మునెయ్య (మున్నా) నిర్మాత. నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్‌ సహ నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్‌ అయింది. టి`సిరీస్‌ ద్వారా విడుదలైన ఆడియో 10 మిలియన్‌లకు దగ్గరగా వెళ్లి రికార్డు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 2న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, ఆయన బిజీ షెడ్యూల్‌ కారణంగా చిత్ర యూనిట్‌ను తన ఇంటికి పిలిపించుకుని ఈ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ప్రసాద్ ల్యాబ్‌లో…