క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియల్ లైఫ్ హీరో అని అన్నారు. సోషల్ విూడియా వేదికగా అభిమానులు, నెటిజన్లతో తరచూ ఇంటరాక్ట్ అవుతూ నెటిజన్ల ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చే ఆయన తాజాగా పవన్‌కల్యాణ్ గురించి మాట్లాడారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ పవన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘కృష్ణవంశీగారు విూ సినిమాలంటే మాకెంతో గౌరవం. ప్రస్తుతం ఆంధప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారిన అంశంపై అనుభవం ఉన్న దర్శకుడిగా విూ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం‘ అని ఎక్స్‌లో నెటిజన్ అడగగా దానికి ఆయన సమాధానమిచ్చారు. ‘మన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. అవినీతిమయంగా మారిన రాజకీయాల్లో ఓ వ్యక్తి విలువలు, విశ్వాసాలు నింపేందుకు కష్టపడుతున్నాడు. భగవంతుడు ఆయనకు ఎప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటున్నా. నిజం…