పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తాజాగా సెట్స్ పై వచ్చిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ను వదులుకున్నబ్యూటీ ఎవరో తెలుసా? పూజాహెగ్డే! అవును.. ఇది నిజంగా నిజమైన వార్తే! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాని వదులుకోవడమేమిటి? అని అనుకుంటున్నారు కదూ..!? అవును ఎవ్వరికైనా ఇదే డౌట్ రావడం కామనే! పరిశ్రమలో టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్స్ రెండుపడవల ప్రయాణం చేస్తున్నారు. టాలీవుడ్-బాలీవుడ్ అంటూ అవసరానికి కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టాలనుకుంటున్నారు. ఇదంతా ఆ భామల అత్యాశే అవుతోంది. అక్కడా మేమే .. ఇక్కడా మేమే అన్న రీతిలో వీరి వ్యవహారం సాగుతోంది. ఫలితంగా కాల్షీట్స్ కుదరకపోవడంతో కొన్ని మంచి సినిమాలను సైతం వదులుకోవలసి వస్తోంది. అన్ని భాషల్లో తమ గ్లామర్ ని పంచుతుంటారు ఈ బ్యూటీస్. ఈ క్రమంలో నాయికలు ఎదుర్కొనే ప్రధాన సమస్య…