నటి పూజిత పొన్నాడ ఆవిష్కరించిన యమ్ ఫార్మ్స్ స్టోర్

m farms store launch

కొండాపూర్లోని రాజరాజేశ్వరీ నగర్ లొ నూతనంగా ఏర్పాటు చేసిన యమ్ ఫార్మ్స్ స్టోర్ ను నటి పూజిత పొన్నాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి పూజిత యమ్ ఫార్మ్స్ ఎండీ-పవన్ రెడ్డికి మరియు ఫ్రాంచైజీ ఓనర్ యాస్మిన్‌కు తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎండీ-పవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం శుభ్రత చాలా అవసరంగా మారింది. కానీ శుభ్రతతో పాటు నాణ్యత కూడా చాలా ముఖ్యమైనది. మా స్టోర్ ద్వారా వినియోగదారులకు శుభ్రత మరియు నాణ్యత కలిగిన పండ్లు మరియు కూరగాయలను అందిస్తున్నాము. విజయదశమి నాడు మొదలు పెట్టిన ఏ కార్యక్రమాలైనా విజయాల బాటలొ సాగిపోతాయనే సంకల్పంతో విజయ దశమిరోజు మా స్టోర్‌ను ప్రారంభించడం జరిగింది. అన్ని యమ్ ఫార్మ్ స్టోర్ లు(FOCO) ఫ్రాంఛైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటడ్ మోడల్‌లో యమ్ ఫార్మ్స్ కంపెనీ చేత నడుపబడతాయి.…