బీట్స్ ఆఫ్‌ రాధే శ్యామ్.. గ్రేట్‌ రెస్పాన్స్

radhe shyam movie poster

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులకి పుట్టినరోజు సందర్భంగా స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చారు రాధేశ్యామ్ చిత్ర నిర్మాణ సంస్థ‌లు గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్.. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే కానుకగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ విక్ర‌మాదిత్యగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫ‌స్ట్ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తాజాగా రెబల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అనే మోష‌న్ పోస్టర్ విడుద‌ల చేశారు. చరిత్రలో నిలిచిపోయిన గొప్ప ప్రేమికులు దేవదాస్, పార్వతి.. లైలా మజ్ను ఫోటోల మీదుగా ఓ ట్రైన్ లో ఈ మోషన్ పోస్టర్ సాగుతుంది. చివరగా ప్రభాస్, పూజా హెగ్డే జోడి కనిపిస్తుంది. ఈ ప్రేమకథ కూడా అంత గొప్పగా ఉంటుందని…

యంగ్‌ రెబల్‌ స్టార్‌.. హీరో అంటే ఇలా ఉండాలి

young rebel star prabhas pic

రెబల్‌స్టార్‌ ‌ప్రభాస్‌.. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్‌లోనే కాదు ఎంటైర్‌ సినీ ఇండస్ట్రీలో మారుమోగుతోంది. టాలీవుడ్‌లో యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ప్రభాస్‌ ‘బాహుబలి’తో ప్యాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఈ ప్రయాణానికి ముందు తన మార్కును క్రియేట్‌ చేసుకోవడానికి ప్రభాస్‌ ఎంతో ఓపికగా కష్టపడ్డారు. తొలి చిత్రం ‘ఈశ్వర్‌’తో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తర్వాత రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్‌నిరంజన్‌, డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, రెబల్‌, మిర్చి వంటి చిత్రాలతో వైవిధ్యత‌ను చూపుతూ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటూ హీరో అంటే ఇలాగే ఉండాలనే విధంగా అన్నీ వర్గాల ప్రేక్షకుల హృదయాల్లో స్టార్‌ హీరోగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రభాస్‌.రేంజ్‌ పెంచిన బాహుబలిప్రభాస్‌ కెరీర్‌ను చూస్తే బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అని…