మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. కేంద్ర ప్రభుత్వం గణత్రంత దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాల్ని ప్రకటించింది. చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. కరోనా, లాక్‌డౌన్ సమయంలో సినీ కార్మికులతోపాటు సామాన్యులకు ఆయన అందించిన సేవలను గురించిన భారత ప్రభుత్వం చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించనుంది. గురువారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పద్మ అవార్డులను ప్రకటించారు. సినీ, రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలకుగానూ 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ భూషణ్ పుర్కస్కారం అందజేసిన విషయం తెలిసిందే. నాలుగు దశాబ్ధాల కెరీర్‌లో ఆయన ఈ స్థాయిలో ఉండటానికి కారణం.. కృషి, పట్టుదల, తపన అని చెబుతుంటారు చిరంజీవి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, సినిమాల మీదున్న ఆసక్తితో ఎలాంటి నేపథ్యం, ఎవరి సహకారం లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నంబర్‌వన్…