స్పోర్ట్స్ అంటే మనకు గుర్తుకు వచ్చే మొదటి ఆట క్రికెట్. ఆ తర్వాత వాలీబాల్, ఫుట్‌బాల్, హాకీ.. ఇలా ఓ అరడజను మాత్రమే టక్కున గుర్తుకు వస్తాయి. కానీ ప్రపంచంలో మరిన్ని స్పోర్ట్స్ ఉన్నాయి. వాటిలో అత్యంత క్లిష్టమైన రేస్ ‘ట్రయత్‌లాన్’. ‘ట్రయత్‌లాన్’ అంటే ఈత కొట్టడం.. సైకిల్ తొక్కడం.. పరుగెత్తడం అనే మూడు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కంబైన్డ్‌గా ఉంటాయి. ఇందులో కూడా అనేక ఛాంపియన్ షిప్‌లు ఉంటాయి. అన్నింటిలోకి అత్యంత క్లిష్టమైన ‘అల్ట్రామాన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ హవాయి ట్రయత్‌లాన్’ అనే రేస్‌లో వరుసగా 2017,18,19 సంవత్సరాల్లో అర్హత సంపాదించిన ఏకైక భారతీయుడు, మన తెలుగువాడు,హైదరాబాద్ కు చెందిన మన్మధ్ రెబ్బ. ఇక్కడ ఆర్కిటెక్ట్ పూర్తి చేసి, యూఎస్‌లో కన్స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ కోర్సు చేయటానికి వెళ్లిన ఆయన కోర్సు అనంతరం అక్కడే ఉద్యోగం చేస్తుండగా ఈ స్పోర్ట్స్…