By -నవీన్ కుమార్ చెన్నం శెట్టి మెగాస్టార్ చిరంజీవి మూడేళ్ళ విరామం తర్వాత ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చివరగా ఆయన ‘భోళాశంకర్’ చిత్రంలో నటించారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఫాంటసీ సినిమా ‘విశ్వంభర’ చేశారు. అనేక కారణాలతో ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్ గారు’ తెరమీదకు వచ్చింది. ఇందులో వెంకటేష్ కీలక పాత్రలో సర్ప్రైజ్ చేయడం విశేషం. నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని ఈ నెల 12న సోమవారం…
