కౌండిన్య ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్ లోవ, లక్ష్మి కిరణ్, హరీష్ బొంపల్లి, మంజీర ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం `ఓసీ`. కిరణ్ & విష్ణు దర్శకులు. విష్ణు శరణ్ బొంపల్లి నిర్మాత. ఈ రోజు ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెన్సేషనల్ డైరక్టర్ వీవీ వినాయక్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా ముని రాజ్ గుత్తా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సత్య మాస్టర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు కిరణ్ లోవ మాట్లాడుతూ…“ నేను నటిస్తూ, దర్శకత్వం వహిస్తోన్న చిత్రానికి ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ గారు వచ్చి క్లాప్ కొట్టడం మా తొలి సక్సెస్ గా భావిస్తున్నాం. ఇప్పటి వరకు నేను తెలుగు, తమిళ భాషల్లో కలిపి హీరోగా 18…