నవదీప్ 2.0 అని, తనని తానూ ‘లవ్, మౌళి’ ద్వారా కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటున్నారు . ఈరోజు ఉగాది సందర్భంగా ఈ ‘లవ్, మౌళి’ సినిమా ట్రైలర్ యువ కథానాయకుడు విశ్వక్ సేన్ చేతుల మీదుగా విడుదల చేశారు. 4.15 సెకండ్స్ నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో నవదీప్ తన నటనతో అందరి ప్రశంశలు పొందారు. మౌళి క్యారక్టర్ లో లేయర్స్, విజువల్స్ అన్ని కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఈ ట్రైలర్ లాంచ్ లో చిత్ర దర్శకుడు, నటీ నటులు పాల్గొన్నారు. హీరోయిన్ భావన మాట్లాడుతూ: ఈ సినిమా ఒక యునీక్ ప్రాజెక్ట్. ప్రతి ఒక్కరు ఏదో ఒక క్యారెక్టర్ తో రిలేట్ అవుతారు. డైరెక్టర్ అవనీంద్ర ఒక కొత్త కథతో వచ్చారు. నవదీప్ తప్ప మౌళి రోల్ ని ఇంకేవ్వరు చెయ్యలేరు.…