ప్రముఖ యువ నృత్య కళాకారిణి విశిష్ఠ డింగరి భరతనాట్య ప్రదర్శనతో నృత్యార్పణం చేయనున్నారు. ముంబయి కి చెందిన నృత్యోదయ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి లోని బ్రహ్మ కుమారీస్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో విశిష్ఠ నృత్య ప్రదర్శన జరుగుతుందని ముంబయి నుంచి విచ్చేసిన ప్రఖ్యాత భరత నాట్య గురు డా. జయశ్రీ రాజగోపాలన్ గురువారం తెలిపారు. త్రిదండి చిన శ్రీమన్నారాయణ జీయరు స్వామి, ప్రముఖ నాట్య గురువు పద్మ విభూషణ్ డా. పద్మా సుబ్రహ్మణ్యం (చెన్నై), సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ, కళారత్న అశోక్ గుర్జాలే తదితరులు పాల్గొంటారు. విశిష్ఠ డింగరి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి కాలిఫోర్నియాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరో వైపు గత 15 ఏళ్లుగా భరతనాట్యం, కూచిపూడి నృత్యం…