యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లె మైల్ స్టోన్ లాంటి చిత్రాన్ని చేయబోతోన్నారు. కెరీర్‌పరంగా 30వ సినిమాగా ‘ఒకే ఒక జీవితం’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైఫై సినిమాకు తరుణ్ భాస్కర్ మాటలను అందించారు. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్గా నటించారు. బుధవారం నాడు ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ.. సతీష్ మాట్టాడుతూ.. ‘ఈ సినిమాలో పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా యూనిట్ అందరికి చాలా థాంక్స్. అందరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.. తరుణ్ భాస్కర్…