ఆధునిక ప్రేమకు..పురాతన శాస్త్రాలకు మధ్య ఒక అద్భుత ప్రయాణం.. ‘ఓహ్’ సినిమా. ఏకరి సత్యనారాయణ దర్శకత్వంలో రఘు రామ్ – శృతిశెట్టి, నైనా పాఠక్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ఒక ప్రేమకథగానే కాకుండా, భారతీయ పురాణాలు ప్రాచీన విజ్ఞానాన్ని జోడించి తీసిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది. కథ : కృష్ణ (రఘురామ్), కావ్య (శృతి శెట్టి) అనే అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమిస్తాడు. అయితే, అతనికి ఉన్న ‘క్రోమోఫోబియా’ అనే వింత సమస్య కారణంగా దృశ్య (నైనా పాఠక్ ) అనే మరో అమ్మాయితో ఉన్న బంధాన్ని గుర్తుంచుకోలేకపోతాడు. ఒకవైపు జ్ఞాపకాలు లేని గతం.. మరోవైపు ప్రాణప్రదమైన ప్రస్తుత ప్రేమ.. ఈ రెండింటి మధ్య కృష్ణ పడే…
