సస్పెన్స్ తో కూడిన ఇరట్ట ట్రైలర్ విడుదల !!!

Official trailer of "Iratta" has been released leaving the audience in suspense.....

జోజు జార్జి నటించిన ఇరట్ట సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ట్రైలర్ చూస్తుంటే జోజు జార్జి రెండు విభిన్నమైన పాత్రల్లో నటించినట్లు తెలుస్తోంది. వినోద్ , ప్రమోద్ అనే రెండు రోల్స్ లో జోజు జార్జి నటించారు. ఈ సినిమా ద్వారా ఎమ్.కె. కృష్ణన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అంజలి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అప్పు పాతు పప్పు మరియు సిజో వడకన్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి స్టేట్ నేషనల్ అవార్డ లు సొంతం చేసుకున్న జోజు ఈ సినిమాలో మరో విభిన్నమైన పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. జోజు మరియు అంజలితో పాటుగా శ్రీన్ద, ఆర్య సలీం, శ్రీకాంత్ మురళి, సబుమోన్ మరియు అభిరామ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.…