ఎన్ఠీఆర్ ‘దేవర’కోసం అధికారికంగా బ్లాక్‌ టిక్కెట్ల దందా!?

Official black tickets for NTR's 'Devara'!?

అగ్ర హీరోల సినిమాలు విడుదల సందర్బంగా టిక్కెట్ల రేట్లు పెంచి రెండు వారాల్లోనే పెట్టిన పెట్టుబడి వచ్చేలా సినిమా నిర్మాతలు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వారికి రేట్లు పెంచుకునేందుకు సహకరిస్తున్నాయి. దీంతో టిక్కెట్లు అమాంతంగా పెరుగు తున్నాయి. అంతేమేరకు బ్లాక్‌ టిక్కెట్లు అమ్ముతున్నారు. ఇకపోతే మిడ్‌నైట్‌ ఫ్యాన్స్‌ షో, బెనిఫిట్‌ షోలు వేయడం ద్వారా మరింత గుంజేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమాను అందరికన్నా ముందుగా చూడాలని ఫ్యాన్స్‌ చూపించే ఉత్సాహాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. దాని కోసం ఎంత వెచ్చించడానికైనా అభిమానులు వెనకాడరు. దానిని ఆయుధంగా చేసుకుని బెనిఫిట్‌ షో నిర్వాహకులు క్యాష్‌ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ సోలోగా తెరపై…