అక్టోబర్ 29న కాంతార (తెలుగు) సక్సెస్ టూర్ : స్వయంగా పాల్గొననున్న హీరో రిషబ్ శెట్టి

oct 29th kantara movie success tour

సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన ‘కాంతార’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15 న విడుదలై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా మెగా నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేసారు. ఈ చిత్రం విజయవంతగా ఆడుతున్న తరుణంలో ప్రేక్షకులను నేరుగా కలిసేందుకు ఈ చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ను నిర్వహించనుంది. అక్టోబర్ 29న (శనివారం) తిరుపతి,వైజాగ్ లోని “కాంతారా’ చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్స్ ను సందర్శంచి,ప్రేక్షకులను కలవనున్నారు. ఈ సక్సెస్ టూర్ లో చిత్ర దర్శకుడు, హీరో అయినటువంటి రిషబ్ శెట్టి పాల్గొంటుండడం విశేషం. ఈ సందర్బంగా మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ…సినిమాకి లాంగ్వేజ్ బారియర్ లేదు సినిమాకి ఎమోషన్ బారియర్…