ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, సినీ ప్రియులను అలరించేందుకు ఎన్టీఆర్ ‘దేవర’తో సిద్ధమయ్యారు. యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్ రాబట్టి అంచనాలను అమాంతం పెంచేసింది. ఎన్టీఆర్ నుంచి దాదాపు ఆరేళ్ల సుధీర్ఘ గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమా ఇదే కావడంతో అభిమానులు కూడా ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకొని అంచనాలను రెట్టింపు చేశారు. ‘బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించే సమయంలో నేను ఆశ్చర్యపోయాను. ఇంత గొప్పగా సినిమాను ఎలా తెరకెక్కించారని…