ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలంలోని యజ్ఞనారాయణపురంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తనయులు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు శ్రీ టి.డి.జనార్ధన్ ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, కేతినేని హరీశ్, శ్రీయాస్ శ్రీనివాస్, మందలపు సుధాకర్, పోటు సరస్వతి, రంజిత్, నవీన్ చంద్ర, ఇతర రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం మాట్లాడుతూ – ఈ రోజు ఎన్టీఆర్ అన్నగారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మన యజ్ఞనారాయణపురంలో ఇంత ఘనంగా జరగడం సంతోషంగా ఉంది. రామకృష్ణ గారు ఎన్టీఆర్ విగ్రహ…