సింగపూర్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

NTR Cine Diamond Jubilee celebrations in Singapore

✤ తరలి వచ్చిన తెలుగు సంఘాలు ✤ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ✤ ఎన్టీఆర్‌ కమిటీ లిటరేచర్‌ ప్రచురణ ‘తారకరామం’ పుస్తకం ఆవిష్కరణ ✤ టి.డి. జనార్ధన్‌ రూపొందించిన ‘గుండెల్లో గుడికట్టినామయ్య’ పాట ‘ఆవిష్కరణ’ ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో జరుగుతున్న క్రమంలో జనవరి 26న భారతదేశ రిపబ్లిక్‌డే నాడు సింగపూర్‌లోని ఆర్యసమాజ్‌ ఆడిటోరియంలో ‘జైఎన్టీఆర్‌ టీమ్‌’ సింగపూర్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 500 మంది ఆహుతుల సమక్షంలో ఘనంగా, రమణీయంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి  ప్రత్యేకంగా విచ్చేసిన నందమూరి తారకరామారావు గారి తనయులు శ్రీ నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు శ్రీ టి.డి.జనార్ధన్‌, ప్రముఖ సినీ నటులు శ్రీ ఎం. మురళీమోహన్‌లు ముఖ్య…