హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’.. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవుతుంది. ప్రతి శుక్రవారం వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను ‘ఆహా’ ఆకట్టుకుంటోంది. నవంబర్ నెలను మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఆహా మారుస్తుంది. అందులో భాగంగా నవంబర్ 13న ‘మా వింత గాధ వినుమా’ చిత్రం ఆహాలో విడుదలవుతుంది. ఆదిత్య మండల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంలో జోడీగా నటించిన సిద్దు జొన్నలగడ్డ, శీరత్‌కపూర్ ఇందులో జంటగా మెప్పించనున్నారు. ఆహా ప్రమోటర్, ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘మా వింత గాధ వినుమా’ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత సంజయ్ రెడ్డి, సిద్ధు జొన్నలగడ్డ, శీరత్‌కపూర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా..అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘తెలుగు ఓటీటీ యాప్‌గా ఆహా ప్రతి నెల క్రమంగా…