వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసంబర్ 23న రిలీజ్ చేయనున్నారు.ఇందులో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి మాట్లాడుతూ… అందరికి నమస్కారం, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. నా కుమారి 21ఎఫ్ సినిమాను వచ్చి బ్లెస్ చేసారు. ఇప్పుడు మా 18 పేజెస్ సినిమాను బ్లెస్ చేయడానికి వచ్చిన ఐకాన్ స్టార్ కి థాంక్యూ సర్. ఇక్కడ లేని…