Nikhil is going to be a father soon! : నిఖిల్‌ త్వరలో తండ్రి కాబోతున్నాడు!

Nikhil is going to be a father soon!

టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ అభిమానులకు గుడ్‌ న్యూస్‌. నిఖిల్‌ త్వరలో తండ్రి కాబోతున్నాడు. నిఖిల్‌ భార్య గర్భవతి అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న నిఖిల్‌ భార్య డాక్టర్‌ పల్లవి బేబీ బంప్‌తో కనిపించిన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పల్లవి గర్భవతి అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై నిఖిల్‌ మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక 2020లో డాక్టర్‌ పల్లవిని నిఖిల్‌ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020 కోవిడ్‌ టైంలో వీరి పెళ్లి కాగా.. కరోనా నిబంధనలను పాటిస్తూ పెళ్లి చేసుకున్నారు. నిఖిల్‌ ప్రస్తుతం ‘కార్తికేయ 2’ సినిమా ఇచ్చిన జోష్‌తో మరో పాన్‌ ఇండియా చిత్రం ‘స్వయంభు’ చేస్తున్నాడు. ఈ సినిమాకు భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా.. మలయాళ భామ సంయుక్తామీనన్‌…