అశోక్ గల్లా. నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా `హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ తో ఇంటర్వ్యూ విశేషాలు… – శ్రీరామ్ ఆదిత్య గారు ఓ సారి కథ చెప్పడానికి పిలిచారు. బయట ఆయన సినిమాల గురించి విన్నాను. ఆయన కథ చెప్పగానే ఆఫ్‌బీట్ సినిమాగా అనిపించింది. అయినా సాంగ్స్ వున్నాయి. కమర్షియల్ అంశాలున్న కథ బిన్నంగా అనిపించింది. – పెద్ద స్టార్స్‌తో నటించినా గల్లా అశోక్ తో నటించడం కష్టం అనిపించలేదు. తను హీరోగా ప్రిపేర్ అయి వున్నాడు. అందుకే నటుడిగా కొత్తవాడనే ఫీల్ నాకు కలగలేదు. – ఇస్మార్ట్…