మైమరపించే అందంతో ఇటీవల టాలీవుడ్ దృష్టిని, ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్నఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మరోసారి చీరకట్టులో మరిన్ని వెలుగుల్ని విరజిమ్మింది. వివరాల్లోకి వెళితే.. గల్ల అశోక్ హీరోగా నటిస్తున్న ‘హీరో’ సినిమాలో నిధి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి సంబంధించి గురువారం హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ హోటల్ లో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్బంగా జరిగిన వేడుకలో విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు తెలిపారు. అయితే..ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. బ్లాక్ శారీలో ధగధగ మె రిసిపోయారు. తన అందంతో చూపరులను ఇట్టే కట్టిపడేసారు. 2017లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘మున్నా మైఖేల్’తో వెండి తెర ప్రయాణాన్ని సాగించిన అందాల తార…