హీరో ఆకాష్ పూరి క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం

మహీంద్ర పిక్చర్స్ పతాకంపై చైతన్య పసుపులేటి ,రితిక చక్రవర్తి జంటగా చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని సత్యసాయి కల్యాణమండపం లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో ఆకాష్ పూరి హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రావ్ బోయపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో … చిత్ర దర్శకుడు చిన్న వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు నిర్మాత వి.శ్రీనివాస రావ్ గారు. వారికి నా ధన్యవాదాలు. హీరో ఆకాష్ పూరి,నిర్మాత వి. రావు…

శ్రీ వెన్నెల క్రియేషన్స్ కొత్త చిత్రం ప్రారంభం

sri vennela creations new movie launch

బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి.ఎమ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న నూతన చిత్రం దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, కంచెరపాలెం రాజు, టిఎన్ఆర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు కోటి సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మా బ్యానర్ లో నిర్మించిన మొదటి సినిమా కళాపోషకులు విడుదలకు సిద్దంగా ఉంది. దర్శకుడు శివ వరప్రసాద్ చెప్పిన పాయింట్ నచ్చడంతో ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. ఇది మా బ్యానర్ లో వస్తోన్న సెకండ్ ప్రాజెక్ట్. కోటి గారు మా సినిమాకు సంగీతం అందించడం సంతోషంగా ఉంది, దసరా సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవ్వడం ఆనందంగా ఉంది. ఎక్కడా రాజీ పడకుండా…