Nenu Student Sir Movie Review In Telugu : ఫర్వాలేదనిపించే ‘నేను స్టూడెంట్ సర్’!

Nenu Student Sir Movie Review In Telugu

నవతరం కథానాయకుడు బెల్లంకొండ గణేష్ నటించిన తన తొలి చిత్రం ‘స్వాతి ముత్యం’తో నటుడిగా మంచి పేరునే తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత తాను చేసిన రెండో చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. ఈ సినిమా పలు మార్లు వాయిదా కూడా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ శుక్రవారం 2 జూన్, 2023న చిత్రం విడుదలయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం… కథ : ఓ కాలేజ్ స్టూడెంట్ సుబ్బు(గణేష్ బెల్లంకొండ). ఓ మంచి ఐఫోన్ కొనుక్కోవాలనేది అతడి కల. తాను ఎప్పుటి నుంచో దానికోసమే ఆలోచిస్తుంటాడు. అలా.. తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో అయితే ఐఫోన్ 12ని కొనుక్కుంటాడు. అయితే… ఆ ఫోన్ వల్ల ఊహించని విధంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అదీ కాకుండా తన బ్యాంక్ అకౌంట్ లో భారీ…