‘డిజె టిల్లు’ చూస్తే నవ్వులతో పాండమిక్ ఒత్తిడి అంతా మర్చిపోతారు : హీరోయిన్ నేహా శెట్టి

Nehashetty Interview

అన్ని వర్గాల ప్రేక్షకులను ‘డిజె టిల్లు’ సినిమా ఆకట్టుకుంటుందని చెబుతోంది యువ తార నేహా శెట్టి. ఆమె రాధిక పాత్రలో నటించిన ‘డిజె టిల్లు’ ఈనెల 12న థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించింది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగ వంశీ చిత్ర నిర్మాత. ‘డిజె టిల్లు’ సినిమా విశేషాలను, చిత్రంలో నటించిన తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు నేహా శెట్టి. ఆమె మాటల్లోనే.. – బాల్యం నుంచే నటి కావాలనే కోరిక ఉండేది. హృతిక్ రోషన్ సినిమాలో డాన్సులు చూసి చిత్రరంగంపై ఇష్టాన్ని పెంచుకున్నాను. చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేశాను. మలయాళంలో ముంగారమళై 2 చిత్రంలో నటించాక, తెలుగులో పూరీ జగన్నాథ్ గారి…