DJ Tillu, starring Siddhu Jonnalagadda and Neha Shetty in the lead roles, is a mad-cap thriller directed by debutant Vimal Krishna and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. The lead actor Siddhu (who has also written the dialogues) and director Vimal Krishna have jointly scripted it and penned the screenplay. The film, whose riveting teaser piqued the curiosity of audiences recently, is all set to storm the theatres for the Sankranti season on January 14. The makers, announcing the news, had released a poster of DJ Tillu featuring…
Tag: Neha Shetty
సిద్దు జొన్నలగడ్డ చిత్రం ‘డిజె టిల్లు’ జనవరి 14 న విడుదల
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘డిజె టిల్లు’. ఈ చిత్రం జనవరి 14-2022 న విడుదల అవుతోంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని కూడా ఈరోజు విడుదల చేసింది. ప్రచార చిత్రాన్ని గమనిస్తే… నాయిక పాదాలను, కథానాయకుడు తన పెదాలతో స్పృశించటం చూస్తుంటే’డిజె టిల్లు’ ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తోంది అనటంలో ఎంతమాత్రం సందేహం లేదనిపిస్తుంది. ఇటీవల విడుదల అయిన’డిజె టిల్లు’ టీజర్ కూడా పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకుందన్నది స్పష్టం. అందులోని దృశ్యాలు గానీ, సంభాషణలు గానీ ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. నూతన దర్శకుడువిమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు ఆయన…