దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒక్క సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఈ అమ్మడు.. దాదాపు 20 ఏళ్లుగా సినిమాల్లో చక్రం తిప్పుతోంది. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. ఈ అమ్మడు సినిమాలతోపాటు ఎప్పుడూ వివాదాల్లోనూ చిక్కుకుంటుంది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న హీరోయిన్ నయనతార తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటిస్తుంది. ఇప్పుడు నయన్ సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. షారుఖ్ ఖాన్ చిత్రం జవాన్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ, ఆ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ మూవీ దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. అలాగే ఈ చిత్రానికి నయన్ రూ.10…
