నవీన్ చంద్ర హీరోగా ‘కరాలి’ ప్రారంభం

Naveen Chandra's 'Karali' begins with a bang

శ్రీమ‌తి మంద‌ల‌పు ప్ర‌వ‌ల్లిక స‌మ‌ర్ప‌ణ‌లో విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్ మీద నవీన్ చంద్ర, రాశీ సింగ్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్లుగా మంద‌ల‌పు శివకృష్ణ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘కరాలి’. ఈ మూవీకి రాకేష్ పొట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆదివారంనాడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, రాజా రవీంద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్‌కు సాహు గారపాటి స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి సాహు గార‌పాటి క్లాప్ కొట్ట‌గా, శ్రీహ‌ర్షిణి ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ అధినేత గోరంట్ల ర‌వికుమార్‌, యాస్పైర్ స్పేసెస్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ తుమాటి న‌ర‌సింహా రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో … * వెర్స‌టైల్ స్టార్ నవీన్ చంద్ర…