ఎంచుకున్న పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే స్టార్స్ లో నాని ఒకరు. అష్టాచమ్మ సినిమాతో హీరోగా తన కెరీర్ మొదలు పెట్టినా అసలు అతను పరిశ్రమలోకి వచ్చిన నాని మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అలా అసిస్టెంట్‌గా చేస్తున్న టైంలో ఇంద్రగంటి మోహనకృష్ణ నానిని హీరోగా పరిచయం చేశారు. మెయిన్ గోల్ హీరోయినే అయినా వచ్చిన ఛాన్స్ వదలకూడదు అన్నట్టుగా దర్శకత్వ శాఖలో పని చేశాడు నాని. అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెట్టి హీరోగా మారిన నాని అష్టా చమ్మా నుంచి కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. తెర మీద నానిని చూడగానే మన పక్కింటి కుర్రాడిలా అనిపిస్తాడు. అదే అతనికి ప్లస్ పాయింట్. ఇక ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే పర్ఫెక్ట్…