అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `నల్లమల`. నల్లమల అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేపథ్యంలో ఆసక్తికర కథా కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆర్.ఎమ్ నిర్మాత. ఈ మూవీలోని సిద్ శ్రీరామ్ పాడిన ఏమున్నవే పిల్లా సాంగ్ మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, అన్ని పాటలకి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రంలోని `మన్నిస్తారా మూగజీవులారా…` పాటను దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు విడుదలచేశారు. ఈ సందర్భంగా .. దర్శకేంద్రుడు మాట్లాడుతూ – “దర్శకుడు రవిచరణ్ మన్నిస్తారా పాటను చాలా బాగా చిత్రీకరించాడు. అప్పుడప్పుడు నల్లమల సినిమా ప్రోమోస్ చూస్తుంటాను. కొత్త…