నా మొదటి సినిమాకే ఇంత ఆదరణ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది : ‘నల్లమల’ సక్సెస్ మీట్ లో దర్శకుడు రవి చరణ్

nallamala movie news

నమో క్రియేషన్స్ పతాకంపై అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ నటీనటులుగా రవి చరణ్ ‌దర్శ‌కత్వంలో ఆర్‌.ఎమ్‌ నిర్మించిన చిత్రం “న‌ల్ల‌మ‌ల‌”. మార్చి 18 శుక్రవారం థియేటర్స్ లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులనుండి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లో నిర్మాణ సంస్థ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో కేక్ కట్ చేసి సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ హొలీ శుభాకాంక్షలు. రెండు రాష్ట్రాల నుండి డిస్ట్రిబ్యూటర్స్ , ఫ్రెండ్స్ అందరూ కూడా సినిమా అద్భుతంగా ఉందని చెపుతున్నారు. ఆవు అమ్మ లాంటిది దాన్ని కాపాడు కోకపోతే మనుగడలేదు అనే కాన్సెప్ట్ తీసుకొని సినిమా తియ్యడం జరిగింది.మంచి కంటెంట్ కు మంచి ఆదరణ అంటే…