కింగ్ నాగార్జున వదిలిన ‘అమరం అఖిలం ప్రేమ’ ట్రైల‌ర్

విజ‌య్ రామ్‌, శివ్‌శ‌క్తి స‌చ్‌దేవ్ జంట‌గా న‌టించిన చిత్రం ‘అమ‌రం అఖిలం ప్రేమ‌’. చ‌ల‌న చిత్రాలు బ్యాన‌ర్‌పై వి.ఇ.వి.కె.డి.ఎస్‌.ప్ర‌సాద్, విజ‌య్ రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. జోనాధ‌న్ ఎడ్వ‌ర్డ్ ద‌ర్శ‌కుడు. సెప్టెంబ‌ర్ 18న ఈ సినిమాను తెలుగు ఓటీటీ యాప్ ఆహాలో విడుద‌ల చేస్తున్నారు. గురువారం(సెప్టెంబ‌ర్ 3) రోజున ఈ సినిమా ట్రైల‌ర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ‘‘అమ‌రం అఖిలం ప్రేమ‌ ట్రైల‌ర్ చూశాను. చాలా బావుంది. మ‌రో చ‌రిత్ర‌, ఏక్ తూజే కేలియె స్టైల్లో అనిపించింది. నాకు ‘బొమ్మ‌రిల్లు’ సినిమా గుర్తుకొచ్చింది. తండ్రీ, కూతురు మ‌ధ్య అనుబంధాన్ని తెలియ‌జేసే చిత్ర‌మిది. విజ‌య్ రామ్‌, శివ్‌శ‌క్తి స‌చ్‌దేవ్ చాలా బాగా యాక్ట్ చేశారు. సెప్టెంబ‌ర్ 18న ఆహాలో విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది.…