కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెన్ తో ఆసక్తిని రేకెత్తించింది. పోస్టర్‌లు, ఫస్ట్ టీజర్, ఫస్ట్ సింగిల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్‌లో విడుదలకు సన్నాహాలు చేసిన మేకర్స్, జనవరి 14న సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు. సినిమా టైటిల్ సాంగ్-నా సామి రంగ లిరికల్ వీడియో విడుదల చేశారు. ఆస్కార్ అవార్డ్ విజేతల ద్వయం- ఎంఎం కీరవాణి క్యాచీ ట్రాక్, చంద్రబోస్ మాస్ లిరిక్స్‌తో ఈ పాట మెస్మరైజ్ చేసింది. ‘మా జోలికొస్తే.. మాకడ్డు వస్తే.. మామూలుగా వుండదు.. నా సామిరంగ.. ఈ గీత తొక్కితే.. మా సేత సిక్కితే.. మాములుగా…