పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెరపై మ్యాజిక్ చేసిన హిట్ పెయిర్ నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గూఢచారి, ఓ బేబీ వంటి అనేక విజయాలను కలిగి ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 2022లో ‘ధమాకా’, ‘కార్తికేయ 2’ చిత్రాలతో మరో రెండు భారీ విజయాలను అందుకుంది. నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలిసి గతంలో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ అనే రెండు గుర్తుండిపోయే చిత్రాలను అందించారు. ఈ రెండు చిత్రాలూ వారిలోని ఉత్తమ ప్రతిభను బయటకు తీసుకొచ్చాయి. థియేటర్లలో ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రాలు.. టీవీ, ఓటీటీ లలో ఇప్పటికీ గొప్ప…