(చిత్రం : నా సామిరంగ, విడుదల: 14, జనవరి-2024, రేటింగ్ : 2.75/5, నటీనటులు: నాగార్జున అక్కినేని, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మర్నా మీనన్, రుక్సర్ ధిల్లాన్, షబీర్ కల్లరక్కల్, రవివర్మ, నాజర్, రావు రమేష్, మధుసూదన్ రావు తదితరులు, దర్శకత్వం: : విజయ్ బిన్ని, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, సంగీత దర్శకులు: ఎం ఎం కీరవాణి, సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్) తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ సంక్రాంతికి విడుదలైన అగ్ర హీరోల చిత్రాల్లో ‘నా సామిరంగ’ ఒకటి. గ్రామీణ నేపథ్యంలో అక్కినేని నాగార్జున నటించిన ఈ చిత్రానికి సంబంధించి విడుదలకు ముందే వచ్చిన ట్రైలర్స్ ద్వారా మంచి క్రేజ్ ఏర్పడింది. మరి.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది.. అక్కినేని…