ఆయుష్ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళి జగన్నాథ్ మచ్చ నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం “తెరవెనుక”. ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్ లుగా, ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి , TNR , శ్వేత వర్మ , సంపత్ రెడ్డి ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్. శంకర్ మాట్లాడుతూ.. తెరవెనుక చిత్ర దర్శకుడు ప్రవీణ్ చంద్ర నాకు గత 25 ఏళ్లుగా తెలుసు. తన మొదటి సినిమాకు సహకరించిన అందరికి ధన్యవాదాలు ఈ సినిమాతో ప్రవీణ్ చంద్ర మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.…