-‘వీరసింహారెడ్డి’ పక్కా బ్లాక్ బస్టర్.. రాసిపెట్టుకోండి: మాస్ మొగుడు సాంగ్ లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఎస్ థమన్ తన మాస్-అప్పీలింగ్ కంపోజిషన్లతో భారీ అంచనాలను నెలకొల్పాడు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా నాలుగో సింగిల్ ‘మాస్ మొగుడు’ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. బాలకృష్ణ, శ్రుతి హాసన్‌లపై థమన్ మాసీవ్, ఎనర్జిటిక్ ట్రాక్‌ను అందించాడు. మనో, రమ్య…