గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’లో గతంలో ఎన్నడూ చూడని మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. టాప్ ఫామ్‌లో ఉన్న ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ జై బాలయ్య స్మాషింగ్ హిట్ గా నిలిచింది. ఈ రోజు సెకండ్ సింగిల్ సుగుణ సుందరి లిరికల్ వీడియోను విడుదల చేశారు. థమన్ ట్యూన్ లవ్లీగా కన్సిస్టెంట్ పేస్ తో ఆకట్టుకుంది. రామ్ మిరియాల, స్నిగ్ధ హై-పిచ్ వోకల్స్ తో ఈ పెప్పీ నెంబర్ ని ఎనర్జిటిక్ గా ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ మాస్ ని మెస్మరైజ్ చేయగా కొన్ని లైన్లు మరింత కిక్ ఇచ్చేలా వున్నాయి. బాలకృష్ణ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో క్లాస్…