గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’లో గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ ట్రీట్ అందించబోతున్నారు. మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్ మెటీరియల్ అంచనాలను పెంచుతోంది. ‘వీరసింహారెడ్డి’ సెకండ్ సింగిల్ సుగుణ సుందరిని డిసెంబర్ 15న విడుదల చేస్తామని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు పాటను లాంచ్ చేయడానికి టైం ని లాక్ చేసారు. సుగుణ సుందరి ఉదయం 9:42 గంటలకు విడుదల కానుంది. ఓ లవ్లీ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ ప్రకటన చేశారు. పోస్టర్‌లో బాలకృష్ణ యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపించగా శృతి హాసన్ మల్టీ-కలర్ డ్రెస్‌లో ఆకట్టుకుంది. ఈ డ్యూయట్ లో లీడ్ పెయిర్ అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించబోతుతున్నారు.…