‘కాలింగ్ బెల్’, ‘రాక్షసి’ వంటి హారర్ థ్రిల్లర్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్‌ని ఏర్పరుచుకున్నారు పన్నా రాయల్. మార్చి 1న రిలీజ్ అవుతున్న ‘ఇంటి నెం.13’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. డిఫరెంట్ మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో పన్నా రాయల్ హ్యాట్రిక్ కొడతారని చిత్ర యూనిట్ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై డా. బర్కతుల్లా సమర్పణలో హేసన్ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. డిఫరెంట్‌గా ఉన్న టైటిల్.. అంతే డిఫరెంట్‌గా ఉన్న ఫస్ట్‌లుక్ ఆడియన్స్‌లో సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. మార్చి 1న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ‘ఇంటి నెం.13’ రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకి…