ప్రముఖ నిర్మాత, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘దీపావళి’. కృష్ణ చైతన్య చిత్ర సమర్పకులు. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రధారులు. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’కు తెలుగు అనువాదం ఈ ‘దీపావళి’. ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ‘స్రవంతి’ రవికిశోర్ ముచ్చటించారు. ఆ విశేషాలు… నిర్మాతగా 38 ఏళ్ళ ప్రయాణం మీది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది? దాదాపుగా నేను చేసిన సినిమాలు అన్నీ సంతృప్తి ఇచ్చాయి. ఆర్ధికంగా కాకపోయినా నేను చేసిన సినిమాల పట్ల నేను గర్వంగా ఉన్నాను. ఎందుకు చేశాననే ఫీలింగ్ అయితే లేదు. నాకు కథ బాగా నచ్చితే ముందడుగు వేస్తా.…