ఆలోచనల అలలతోనే అనునిత్యం సాన్నిహిత్యం… కథా, కథన మథనంతోనే సదా గడిపే సాంగత్యం… ఘన విజయాల నిధులను నిక్షిప్తం చేసుకున్న ఔన్నత్యం.. వెరసి… తనే తరహా చిత్రాన్ని చేపట్టినా.. అందులో తనదైన ముద్రను స్పష్టంగా చూపించే సమర్ధుడు.. అపార అనుభవం – అమిత నైపుణ్యం లోలోతుల్లో నింపుకున్న సముద్రుడు… ఆయనే మాస్ డైరెక్టర్ వి. సముద్ర. “సింహరాశి, శివరామరాజు, ఎవడైతే నాకేంటి, చండీ, మహానంది, పంచాక్షరి”, వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు వి. సముద్ర.. క్లాస్ చిత్రాలైనా, మాస్ చిత్రాలైన కుటుంబ సమేతంగా చూసే విధంగా సినిమాలను రూపొందించడంలో ఆయనకో ప్రత్యేకమైన శైలి వుంది. నేటి తరానికి అనుగుణంగా తనకు తాను అప్ డేట్ అవుతూ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే సదుద్దేశంతో సినిమాలను రూపొందిస్తున్నారు మాస్…