టాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకొచ్చే క్రైమ్..ఇన్వెస్టిగేటివ్ కథలకు మంచి స్పందన ఉంటుంది. అలాంటి కథలకు ఆడియెన్స్ బాగా ఎట్రాక్ట్ అవడమేగాక.. సినిమాను ఆదరించి బాక్సాఫీస్ వద్ద కాసులపంట పండిస్తుంటారు. సరైన కథ.. అందుకు తగ్గ స్క్రీన్ ప్లే తో క్రైం రేట్ ను తెరపై ఆవిష్కరి స్తే… బాక్సాఫీస్ వద్ద బొమ్మ హిట్టే. సరిగ్గా ఇలాంటి కథ ఒకటి ప్రేక్షకుల మనసులను దోచుకోవడానికి వచ్చింది. ఆ కథే ‘ముఖ్యగమనిక’. టైటిలోనే ఎంతో క్యాచీనెస్ కనిపిస్తుంది. దర్శకుడు వేణు మురళీధర్. వి. ‘ముఖ్య గమనిక’ అనే ఈ కథను ఎంతో ఆసక్తిగా తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కజిన్ … అంటే అల్లు అర్జున్ కి మేనమామ కొడుకు అయినటువంటి విరాన్ ముత్తంశెట్టి.. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాజశేఖర్, సాయి కృష్ణ ఈ సినిమాని శివిన్ ప్రొడక్షన్స్…