బొంత రాము హీరోగా నటిస్తున్న సినిమా “మిస్టర్ రాము”. ఈ చిత్రంలో అజయ్ ఘోష్ విలన్ గా నటిస్తున్నారు. జబర్దస్త్ అప్పారావు మరో కీ రోల్ పోషించారు. ఈ చిత్రాన్ని రేణుక దేవి ఫిలింస్ బ్యానర్ పై బొంత రాము నిర్మించారు. అజయ్ కౌండిన్య దర్శకత్వం వహించారు. త్వరలో “మిస్టర్ రాము” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. నటుడు జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ – మిస్టర్ రాము సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చిన మీ అందరికీ థాంక్స్. ఆడియో రిలీజ్ ఈవెంట్ కి ఇంతమంది వచ్చారంటే మీరంతా సినిమాను తప్పకుండా సక్సెస్ చేస్తారని తెలుస్తోంది. డైరెక్టర్ అజయ్ కౌండిన్య నాకు బాగా పరిచయం. ఈ…
